ఆ సంస్థలకు కృతి సనన్ లీగల్ నోటీసులు.. అసలేం జరిగింది?
on Dec 4, 2023
ఆమధ్య వచ్చిన ‘1నేనొక్కడినే’ చిత్రంలో మహేష్‌తో జోడీ కట్టి తెలుగు ప్రేక్షకులను పలకరించిన కృతి సనన్ తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసిన ‘ఆదిపురుష్’లో సీతగా నటించింది. అంతేకాదు ‘మిమి’ అనే చిత్రంలోని తన నటనను మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఉత్తమనటిగా జాతీయ అవార్డు అందించి సత్కరించింది. ఇటీవల ‘గణపథ్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల బాలీవుడ్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో సందడి చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఆమె కొన్ని ఆరోపణలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అదేమిటంటే కొన్ని ట్రేడిరగ్ మాధ్యమాలను కృతి సనన్ సపోర్ట్ చేస్తోందంటూ కొన్ని మాధ్యమాలలో వార్తలు వచ్చాయి. దీనిపై కృతిసనన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది.
‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో నేను మాట్లాడని విషయాల గురించి మీడియాలో ప్రచారం జరిగింది. ట్రేడిరగ్ ప్లాట్‌ఫామ్‌లతో నాకు అనుబంధం ఉందని కథనాలు ప్రచురించారు. అవన్నీ అవాస్తవం అని తెలియజేస్తున్నాను. ఇలాంటి తప్పుడు కథనాలు, నివేదికలపై నేను చట్ట పరమైన చర్యలు చేపట్టాను. ఆయా సంస్థలకు లీగల్ నోటీసులు జారీ చేశాను. ఇలాంటి కల్పిత రిపోర్టుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి’ అంటూ తన పోస్ట్‌లో పేర్కొంది కృతి సనన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



